కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై విచారణ జరుపుతున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందంపై మంగళవారం దాడి జరిగింది. జాదవ్‌పూర్‌లో ఈ ఘటన జరిగినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ఎన్నికల తర్వాత హింసపై విచారణ జరిపేందుకు మేము జాదవ్‌పూర్‌లో పర్యటించాం. అక్కడ 40కిపైగా ఇళ్లను ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగానే మాపై దాడి జరిగింది అని ఎన్హెచ్ఆర్సీ బృందంలోని ఓ సభ్యుడు చెప్పినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ హింసపై విచారణ జరిపేందుకు సోమవారమే పశ్చిమ బెంగాల్‌కు వెళ్లింది.
West Bengal: National Human Rights Commission (NHRC) team that visited Jadavpur to investigate post-poll violence was attacked.
— ANI (@ANI) June 29, 2021
"During probe, it has been found that more than 40 houses have been destroyed here. We are being attacked by goons," says an NHRC official. pic.twitter.com/iTUcBIZ2GU