Nida Khan: నేను గర్భవతిని.. బెయిల్ ఇవ్వండి.. టీసీఎస్ కేసులో నిందితురాలు నిదాఖాన్
Nida Khan : టీసీఎస్ మతమార్పిడి కేసులో నిందితురాలు నిదా ఖాన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నది. త్వరలో తల్లి కాబోతున్నట్లు చెప్పిన ఆమె.. మెడికల్ బ్యాక్‌గ్రౌండ్‌పై బెయిల్ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిదా ఖాన్ .. స్థానిక నాసిక్ కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకున్నది.
ముంబై: నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మతమార్పిడులు జరిగిన కేసులో నిందితురాలు నిదా ఖాన్(Nida Khan) ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలిసింది. ఆమె గర్భవతి అని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. త్వరలో ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉన్నది. ముందస్తు బెయిల్ కోసం నాసిక్‌లోని స్థానిక కోర్టును ఆమె ఆశ్రయించింది. బెయిల్ అప్లికేషన్లో ఆమె తన ఆరోగ్యం గురించి వెల్లడించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అదికారులు ఆమెను కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీసీఎస్‌లో లైంగిక వేధింపులు, మతమార్పుడులు జరిగినట్లు 9 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు చెప్పారు. ఆ కేసుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడు మంది ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. దీంట్లో ఆరుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నది. సీనియర్ ఉద్యోగులు తమను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులను హెచ్ఆర్ మేనేజ్మెంట్ విస్మరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి 2022 నుంచి 2026 వరకు ఈ అఘాయిత్యాలు జరిగినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

