Neela Rajendra: ట్రంప్ ఆదేశాలు.. నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొలగింపు
Neela Rajendra: నాసాలో పనిచేస్తున్న భారతీయ సంతతి మహిళా చీఫ్ నీలా రాజేంద్ర తన ఉద్యోగాన్ని కోల్పోయారు. నాసాలోని ఈడీఐ చీఫ్‌గా ఉన్న ఆమె.. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకు ఔటయ్యారు. వాస్తవానికి ఆమెకు మరో ఉద్యోగం కల్పించినా.. ట్రంప్ ఆదేశాలను కఠినంగా అమలు చేస్తున్నారు.
వాషింగ్టన్ డీసీ: నాసాలో పనిచేస్తున్న భారతీయ సంతతి ఉద్యోగి నీలా రాజేంద్ర(Neela Rajendra )ను తొలగించారు. నాసాకు చెందిన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్(డీఈఐ) చీఫ్‌గా ఆమె వ్యవహరించారు. ఇటీవల ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల వల్ల ఆమె ఆ జాబ్ కోల్పోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ప్రోగ్రామ్‌లను రద్దు చేయాలని ట్రంప్ ఆ ఆదేశాల్లో కోరారు. వాస్తవానికి నీలా రాజేంద్రను తొలగించడానికి ముందు ఆమెకు మరో హోదాను ఇచ్చారు. టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయి సక్సెస్ శాఖకు హెడ్‌ను చేశారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ పదవి కల్పించారు. కానీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించకుండా చేసిన ప్రయత్నం ఫలించలేదు.
నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ గత వారం ఓ ఈమెయిల్ షేర్ చేసింది. నాసాలో పనిచేస్తున్న ఉద్యోగులకు నీలా రాజేంద్రను తొలగించిన విషయం చెప్పినట్లు ఆ మెయిల్లో వెల్లడించారు. జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో నీలా రాజేంద్ర పనిచేయడం లేదని, మన సంస్థకు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నామని ఆ మెయిల్లో రాశారు.
గత ఏడాది జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లోని ఉద్యోగులను తొలించారు. డీఈవైలో పనిచేస్తున్న 900 మందిపై వేటు వేశారు. కానీ నీలా రాజేంద్రను అప్పుడు తొలగించలేదు. ట్రంప్ ఆదేశాలతో డైవర్సిటీ శాఖను మార్చి నెలలో నాసా మూసివేసినా.. రాజేంద్ర మాత్రం తన ఉద్యోగాన్ని కోల్పోలేదు. హోదా మార్చడంతో ఆమె వేటు నుంచి తప్పించుకున్నారు. కానీ ఆమె బాధ్యతలు అవే నిర్వర్తించారు. ఆమె కోసం కొత్త డిపార్ట్మెంట్ను క్రియేట్ చేశారు.
లింక్డిన్లో నీలా రాజేంద్ర తన ప్రొఫైల్ మార్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ ట్రంప్ ఆదేశాలను కఠినంగా అమలు చేశారు. నాసా విధుల నుంచి ఆమెను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చాన్నాళ్లు నాసాలో నాయకత్వ హోదాలు నీలా రాజేంద్ర పనిచేశారు. నాసా డైవర్సిటీ శాఖ ఇంచార్జీగా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

