NASA | న్యూఢిల్లీ: నాలుగు చిన్న గదులు, ఒక జిమ్, చుట్టూ ఎర్రని ఇసుక.. భూమిపై నాసా నిర్మించిన అంగారక గ్రహ ఆవాస ముఖ చిత్రమిది! భూమి పక్కనే ఉండే అంగారకగ్రహంలో నివాస యోగ్యతను పరిశీలించడానికి త్వరలో నాసా ప్రయోగం చేపట్టనున్నది.
ఇందుకోసం భూమిపైనే అంగారక గ్రహానికి సంబంధించిన కృత్రిమ నివాసాన్ని సృష్టించింది. వలంటీర్లతో ఏడాది పాటు అందులో ప్రయోగం చేయనున్నది. హౌస్టన్లోని నాసా పరిశోధన కేంద్రంలో ఈ అంగారక ఆవాసాన్ని తీర్చిదిద్దారు. ఈ ఏడాది వేసవిలో ఈ ఆవాసంలో నలుగురు వలంటీర్ల జీవనం ప్రారంభమవుతుంది. ఈ పరిశోధనలో భాగంగా సుదీర్ఘ ఐసోలేషన్లో వలంటీర్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తారు.