‘ఐయామ్ గేమ్’ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది
‘ఇది నా సంస్థలో తీసిన అతిపెద్ద సినిమా. ఈ కథలోని విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దర్శకుడు నాగ్అశ్విన్ ఈ సినిమా ఎడిటింగ్‌లో సహాయపడ్డారు. నా తెలుగు సినిమాల్లో ‘మహానటి’ నాకిష్టమైన సినిమా. నా నటజీవితానికే ఆ సినిమా ఓ మలుపు. తెలుగులో నేను కూడా ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నానంటే.. ఆ క్రెడిట్ అంతా నాగీ, ప్రియాంక, స్వప్నలకే చెందుతుంది.
‘ఇది నా సంస్థలో తీసిన అతిపెద్ద సినిమా. ఈ కథలోని విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దర్శకుడు నాగ్అశ్విన్ ఈ సినిమా ఎడిటింగ్‌లో సహాయపడ్డారు. నా తెలుగు సినిమాల్లో ‘మహానటి’ నాకిష్టమైన సినిమా. నా నటజీవితానికే ఆ సినిమా ఓ మలుపు. తెలుగులో నేను కూడా ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నానంటే.. ఆ క్రెడిట్ అంతా నాగీ, ప్రియాంక, స్వప్నలకే చెందుతుంది. ఈ సినిమా విషయంలోనూ వారి సహకారం ఉన్నది. ఈనెల 3న థియేటర్లలోకి సినిమా రానున్నది. తప్పకుండా మీ అందర్నీ సినిమా ఆనందింపజేస్తుంది’ అని అగ్ర నటుడు దుల్కర్ సల్మాన్ అన్నారు. జామ్ వర్గీస్‌తో కలిసి వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై ఆయన నిర్మించిన పాన్ ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. దుల్కర్ సల్మాన్ కథానాయకుడు.
కయాదు లోహర్ కథానాయిక. నహాస్ హిదాయత్ దర్శకుడు. ఈ నెల 3న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దుల్కర్ మాట్లాడారు. ‘ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నది. ఈ సినిమా కొంత చూశాను. ఇందులో వినోదం కూడా ఓ స్థాయిలో ఉంటుంది. సినిమాను అమితంగా ప్రేమించే దుల్కర్ చేసిన ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని అతిథిగా విచ్చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా ఆంటోని వర్గీస్, సందీప్ గుణ్ణం, కదిర్ కూడా మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు రాష్ర్టాల్లో ఈ సినిమా విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

