న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ్(Maha Kumbh)లో పవిత్ర స్నానాలు చేసేందుకు కోట్లాది జనం వెళ్తున్నారు. ఆ త్రివేణి సంగమ ప్రదేశం ఇప్పుడు రాత్రిపూట దీపకాంతులతో వెలిగిపోతున్నది. కోట్లాది జనాల్ని ఆకర్షిస్తున్న ఆ కుంభమేళా.. ఆకాశం నుంచి కూడా అద్భుతంగా కనిపిస్తోంది. ఆ సనాతన సంప్రదాయ సమ్మేళనాన్ని.. నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ తన కెమెరాలో బంధించారు. ఆస్ట్రోనాట్ డాన్ పెటిట్ కుంభమేళాకు చెందిన ఫోటోను రిలీజ్ చేశారు. రాత్రి పూట త్రివేణి సంగమ ప్రదేశం.. లైట్ల వెలుతురులో ఓ నక్షత్ర కూటమిలా కనిపిస్తున్నది.
ఆస్ట్రోఫోటోగ్రఫీకి పెటిట్ చాలా ఫేమస్. గంగానది ఒడ్డున జరుగుతున్న కుంభమేళా ఫోటో ఇదే అని, ప్రపంచంలో ఒకే చోట హాజరైన అతిపెద్ద మానవ సమాహారం అని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడతను. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఫోటోను తీశారు. హైపవర్డ్ కెమెరాల ద్వారా ఈ అద్భుతాన్ని బంధించారు.
ఆ ఫోటోపై ఇంటర్నెట్ యూజర్లు కూడా స్పందిస్తున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.
2025 Maha Kumbh Mela Ganges River pilgrimage from the ISS at night. The largest human gathering in the world is well lit. pic.twitter.com/l9YD6o0Llo
— Don Pettit (@astro_Pettit) January 26, 2025