Narendra Modi : రష్యాతో చమురు ఒప్పందం.. దౌత్య సంబంధాల పటిష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల మోతకు భయపడేది లేదంటున్న మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Dhoval)ను రష్యాకు పంపించారు. శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ ద్వారా తెలియజేశారు.
ఈ ఏడాదిలో స్వదేశంలో భారత్, రష్యా 23వ వార్షిక సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మోడీ.. ఉక్రెయిన్ యుద్ధం పురోగతి విషయమై రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. ‘స్నేహితుడు పుతిన్‌తో సంభాషణ సమగ్రంగా, ఉపయుక్తంగా సాగింది. ఉక్రెయిన్ యుద్ధం తాజా అప్డేట్స్ విషయంలో ఆయనకు ఫోన్లోనే ధన్యవాదాలు తెలియజేశాను. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై కూడా ఇద్దరం చర్చించాం.
Had a very good and detailed conversation with my friend President Putin. I thanked him for sharing the latest developments on Ukraine. We also reviewed the progress in our bilateral agenda, and reaffirmed our commitment to further deepen the India-Russia Special and Privileged…
— Narendra Modi (@narendramodi) August 8, 2025
అంతేకాదు రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో కట్టుబడి ఉన్నామని పుతిన్‌తో చెప్పాను. ఈ ఏడాది చివర్లో పుతిన్‌ను భారత్‌కు ఆహ్వానించనున్నాను’ అని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై మరోసారి భారత్ తటస్థ వైఖరిని మోడీ స్పష్టం చేశారు. ఇరు దేశాధినేతలు చర్చించుకొని.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.