బెంగుళూరు: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి(Narayana Murthy) కూతురే. అయితే ఆ ఇద్దరూ బెంగుళూరులో కనిపించారు. ఆ ఇద్దరికి చెందిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. బెంగుళూరులోని ఓ పాపులర్ లొకేషన్లో ఇద్దరు కలిసి ఐస్క్రీమ్ తిన్నారు. ఆ ఫోటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరూ.. నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కార్నర్ హౌజ్ హోటల్లో అక్షతా మూర్తి, నారాయణ మూర్తి ఐస్క్రీమ్ తిన్నారు.
గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన జీ20 సమావేశాలకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరయ్యారు. ఆ సమయంలో అక్షతా మూర్తి తన భర్తతో కలిసి ఇండియాకు వచ్చారు. బ్రిటన్ ప్రధాని అయిన తర్వాత ఆయన తొలిసారి ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో వాళ్లు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని విజిట్ చేశారు.
Three Bengaluru icons in the same picture. N R Narayana Murthy, founder of Infosys, Akshata Murthy, first Lady of Great Britain and Corner House the finest ice cream joint of Bengaluru!! pic.twitter.com/86mCNEm2t7
— Brijesh Kalappa (@brijeshkalappa) February 12, 2024