DK Shivakumar: నందిని బెటర్.. అముల్ వద్దు
DK Shivakumar: అముల్ కన్నా నందిని బ్రాండ్ పాలు బెటర్ అని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అముల్‌ను ముందుకు నెట్టి, నందినిని వెనక్కి నెట్టడం సరికాదు అని ఆయన అన్నారు.
హసన్: అముల్ పాల కన్నా.. నందిని(Nandini) బ్రాండ్ పాలు బెటర్ అని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీ శివకుమార్(DK Shivakumar) అన్నారు. ఇవాళ హసన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని నందిని మిల్క్ పార్లర్(Milk Parlour)ను విజిట్ చేసి అక్కడే ఆ పాల ఉత్పత్తుల్ని తీసుకున్నారు. కర్నాటకలోకి అముల్ ఉత్పత్తుల్ని తీసుకురావడం పట్ల ఆయన వ్యతిరేకించారు.నందిని తమ రాష్ట్ర ఉత్పత్తి అని, ఆ మిల్క్ బ్రాండ్.. గుజరాత్‌కు చెందిన అముల్(Amul) కన్నా బెటర్ అని అన్నారు.
తమకు అముల్ అవసరం లేదని, తమ నీళ్లు, పాలు, నేల బలంగా ఉన్నట్లు శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో రైతుల హక్కులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కర్నాటకలో సుమారు 70 లక్షల మంది రైతులు పాల ఉత్పత్తిలో ఉన్నారని, వాళ్లంతా నందిని సంస్థకు పాలను ఇస్తున్నారని, గుజరాత్‌లోని అముల్ కూడా రైతుల నుంచే పాలను కొంటోందని, కానీ అముల్‌ను ముందుకు నెట్టి, నందినిని వెనక్కి నెట్టడం మంచికాదన్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎటువంటి సాయాన్ని అందించలేదన్నారు. మన ఉత్పత్తుల్ని, మన రైతుల్ని మనమే రక్షించుకోవాలని శివకుమార్ తెలిపారు.
ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ప్రస్తుతం దేశంలో రెండవ స్థానంలో నందిని బ్రాండ్ ఉందని, ఇక నుంచి ఆ ఉత్పత్తిల్ని విదేశాలకు కూడా సరఫరా చేస్తామని బీజేపీ నేత రవికుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

