Drug Mafia | డ్రగ్ మాఫియాకు షిండే సర్కార్ వత్తాసు : మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
Drug Mafia : వర్లి హిట్ అండ్ రన్ కేసులో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే సర్కార్ లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె విమర్శలు గుప్పించారు.
Drug Mafia : వర్లి హిట్ అండ్ రన్ కేసులో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే సర్కార్ లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె విమర్శలు గుప్పించారు. షిండే సర్కార్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో మాఫియాలు చెలరేగాయని ఆరోపించారు. అతని (నిందితుడు మిహిర్ షా) రక్తంలో డ్రగ్స్ ఉండి ఉంటాయి, అతను రక్త పరీక్ష అనంతరం పోలీసుల ఎదుటలొంగిపోయాడని అన్నారు. మిహిర్ షాను పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పారు. షిండే సర్కార్ రాష్ట్రంలో డ్రగ్ మాఫియాలకు ఊతం ఇస్తోందని, ప్రభుత్వ తీరు ఇలా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతోనే పరిస్ధితి ఇలా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నుల కోసం షిండే సర్కార్ పనిచేస్తో్ందని, పేదలకు ఏమైనా జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోదని దుయ్యబట్టారు. మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో రాజేష్ షాపై శివసేన చర్యలు చేపట్టింది. ఆయన్ని పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ బుధవారం ప్రకటించింది. కాగా, ఈ కేసులో రాజేష్ షా అరెస్టై సోమవారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
Read More :
DSC | మీ కాళ్లు మొక్కుతా.. డీఎస్సీ వాయిదా వేయండి.. ఓ మహిళా అభ్యర్థి ఆవేదన ఇదీ.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

