న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : మన మొబైల్‌కు ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడుతున్నాం. ఇకపై అలాంటి అవసరం లేకుండా, ఫోన్ కనెక్షన్ సమయంలో ఇచ్చిన ఐడీలోని పేరు ఇన్కమింగ్ కాల్స్ సమయంలో మొబైల్ స్క్రీన్‌పై కనిపించే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ శాఖ అందించిన ప్రతిపాదనలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది అందుబాటులోకి రానుంది.
కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)గా పేర్కొనే ఈ సర్వీస్ ద్వారా ఇకపై వినియోగదారులు తమకు వచ్చే కాల్స్‌లో పారదర్శకత పొందుతారు. మనకు కాల్ చేసే వ్యక్తి ఆయా టెలికం ఆపరేటర్ వద్ద ఏ పేరుతో అయితే సిమ్ తీసుకున్నాడో ఆ పేరు మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. దీని ద్వారా స్పామ్ కాల్స్ బెడద తప్పుతుంది. సీబీఐ, ఐటీ, పోలీస్, సీఐడీ వంటి పేర్లతో మోసపుచ్చే అవకాశం ఉండదు. వినియోగదారులకు ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ప్రారంభమవుతుంది.