అద్దె చెల్లించలేక.. నకిలీ నోట్లు ముద్రించి..
అద్దె ఇంట్లో ఉంటూ రూ.85 లక్షల ఫేక్ కరెన్సీ ముద్రించిన ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నది. ఖర్బీ ప్రాంతంలో పుష్పక్ కృష్ణ భండార్కర్ అలియాస్ బెండానే అనే వ్యక్తి సుమారు ఏడాదిన్నర క్రితం ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు.
ముంబై : అద్దె ఇంట్లో ఉంటూ రూ.85 లక్షల ఫేక్ కరెన్సీ ముద్రించిన ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నది. ఖర్బీ ప్రాంతంలో పుష్పక్ కృష్ణ భండార్కర్ అలియాస్ బెండానే అనే వ్యక్తి సుమారు ఏడాదిన్నర క్రితం ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి అద్దె చెల్లించట్లేదు. యజమాని అద్దె గురించి అడగ్గా కత్తితో బెదిరించాడు.
దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా పుష్పక్ అద్దెగదికి రావడం మానేశాడు. నెలల తరబడి రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అతనిరూమ్లో నకిలీ నోట్ల బాగోతం బయటపడింది. రూ.37లక్షల విలువైన నోట్లు పూర్తిగా ముద్రించి ఉన్నాయి. మరో రూ.48 లక్షల నోట్లు ఒకవైపు మాత్రమే ముద్రించి ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

