వారణాసి: మహాశివరాత్రి పర్వదినం వేళ.. నాగసాధువులు(Naga Sadhus) కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. శైవ సంప్రదాయానికి చెందిన ఏడు అకాడాలు.. గంగా ఘాట్ల నుంచి విశ్వనాథుడి ఆలయానికి ఊరేగింపు తీశాయి. ఆ సమయంలో భారీ ప్రదర్శ ఇచ్చారు నాగసాధువులు. ప్రయాగ్రాజ్ నుంచి చేరుకున్న సాధువులు.. ఇవాళ ఉదయం కాశీలో విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. నాగా సాధువుల జలాభిషేకం కోసం ఆలయ దర్శన వేళల్లో మూడు గంటల పాటు విరామం ఇచ్చారు. నాగ సాధువుల ర్యాలీకి చెందిన డ్రోన్ వీడియోను అధికారులు రిలీజ్ చేశారు. సాధువులపై ప్రభుత్వం పూల వర్షం కురిపించింది.
#WATCH | Mahashivratri Celebrations in Varanasi
Naga Sadhus led a grand procession at the Kashi Vishwanath Temple on the sacred occasion of #Mahashivratri. The district administration captured the divine spectacle through drones.@UPGovt @Uppolice @CMOfficeUP @myogiadityanath… pic.twitter.com/Is7eU9vRxy
— Benefit News (@BenefitNews24) February 26, 2025
ఏడు అకాడాలకు చెందిన సుమారు పదివేల మంది నాగ సాధువులు ర్యాలీల్లో పాల్గొన్నారు. శరీరానికి విభూతి రాసుకుని, మెడలో పూలమాలలతో.. శివనామస్మరణ చేస్తూ ర్యాలీ తీశారు. చేతుల్లో త్రిశూలాలు, గధలు పట్టుకుని విన్యాసాలు చేశారు. కాశీ విశ్వనాథుడిని ఇవాళ పెళ్లి కుమారుడి రూపంలో అందంగా అలంకరించారు. శివరాత్రి దర్శనం కోసం భారీ సంఖ్యలో జనం కాశీకి చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు లక్షల్లో దర్శనాలు జరిగాయి. సుమారు మూడు కిలోమీటర్ల మేర జనం లక్షల సంఖ్యలో దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.
Varanasi, Uttar Pradesh: The akhadas arrived at the Kashi Vishwanath Temple, where the Naga sadhus, along with their followers, were welcomed with a shower of flowers pic.twitter.com/nwODksa8bj
— IANS (@ians_india) February 26, 2025