JP Nadda | పెరుగుతున్న వడదెబ్బ కేసులు.. ఆస్పత్రులకు కేంద్రం మార్గదర్శకాలు జారీ
JP Nadda : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో వడగాడ్పులకు ప్రజలు తల్లడిల్లుతున్న పరిస్ధితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
JP Nadda : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో వడగాడ్పులకు ప్రజలు తల్లడిల్లుతున్న పరిస్ధితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వడదెబ్బకు గురవుతున్న కేసులు, మరణాలు పెరుగుతున్న క్రమంలో అన్ని ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని వెల్లడించారు.
వడదెబ్బకు గురైన వారికి అందించే చికిత్స, ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సెంట్రల్ ఆస్పత్రులు, ఇతర ఆస్పత్రులను సందర్శించాలని తాను అధికారులను ఆదేశించానని మంత్రి తెలిపారు. వడగాడ్పుల తీవ్రత పెరిగిన క్రమంలో తాము రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు.
ప్రజలు ఎండ వేళ బయటకు రావద్దని, ద్రవాహారం అధికంగా తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డీహైడ్రేషన్ బారినపడకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. తాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నిర్మాణ్ భవన్లో ప్రతి విభాగం సందర్శించానని ఆయన తెలిపారు. వ్యాధులు చెప్పి రావనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పనులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించానని వెల్లడించారు.
Read More :
Dwaraka Tirumala Rao | ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

