న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్య నాణ్యతను మరింత మెరుగుపర్చడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కింద ఉండే స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) అక్రిడిటేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. ఇక నుంచి విద్యాసంస్థలు వీటి కోసం డిజిటల్‌గా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జూలై 29న జరిగే జాతీయ విద్యా విధానం 2020 ఐదో వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రకటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,170 యూనివర్సిటీల్లో కేవలం 40 శాతం, కాలేజీల్లో కేవలం 20 శాతం మాత్రమే అక్రిడిటేషన్‌ను పొందాయని న్యాక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ సహస్రబుద్ధే వెల్లడించారు.