Sudha Murty | ‘నా కుమార్తె అక్షతా మూర్తి (Akshata Murty) తన భర్త రిషి సునాక్ (Rishi Sunak)ను బ్రిటన్ ప్రధాని (UK Prime Minister)ని చేసింది’ అని విద్యావేత్త, రచయిత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి (Sudha Murty) అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధామూర్తి.. తన కుమార్తె, అల్లుడి గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లుడు రిషి సునాక్ అతి చిన్న వయసులో బ్రిటన్ ప్రధాని కాగలిగాడంటే అందుకు తన కుమార్తె ప్రోత్సాహమే కారణమన్నారు.
‘నా కుమార్తె తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది. ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉండడమే ఇందుకు కారణం. ఒక భర్తను భార్య ఎలా మారుస్తుందో మీరే చూడండి. అయితే నా భర్తను నేను మార్చలేకపోయాను. నా భర్తను నేను వ్యాపారవేత్తను చేశాను. కానీ , నా కూతురు మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది.
అక్షతా మూర్తి తన భర్తను ఎన్నో విధాలుగా ప్రభావితం చేసినట్టు సుధామూర్తి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అక్షత కారణంగా రిషి ఆహార నియమాలు ఎలా మారాయో కూడా వివరించారు. రాఘవేంద్ర స్వామి భక్తులమైన తాము ప్రతి గురువారం ఉపవాసం ఉంటామని ఆమె తెలిపారు. గురువారం నాడే ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ప్రారంభమైన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన అల్లుడు రిషి సునాక్ పూర్వీకులు 150 ఏండ్లుగా ఇంగ్లండ్‌లోనే ఉంటున్నారని, అయినప్పటికీ వారంతా చాలా దైవభక్తి కలిగిన వారని తెలిపారు. రిషి తల్లి ప్రతి సోమవారం ఉపవాసం ఉంటారని.. కానీ, రిషి మాత్రం ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారని ఆమె వెల్లడించారు. రిషి సునాక్ 2009లో అక్షతా మూర్తిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతి పిన్న వయసులోనే బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఆయన ఎదిగారు.
I made my husband a businessman. My daughter made her husband Prime Minister of UK !
– Sudhamurthy pic.twitter.com/031ByqhDWZ
— Vishweshwar Bhat (@VishweshwarBhat) April 23, 2023
Also Read..
Uday Samant | ఆ 33 మంది ఎమ్మెల్యేలు సీఎం షిండేతో టచ్‌లో ఉన్నారు : మంత్రి సంచలన వ్యాఖ్యలు
India Corona | 24 గంటల్లో 7,533 కొత్త కేసులు.. 44 మరణాలు
Filmfare Awards 2023 | అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటిగా ఆలియా భట్