పాట్నా: బీహార్(Bihar Wedding)లో ఓ నిఖా విందులో హింస చోటుచేసుకున్నది. వధూవరులకు చెందిన కుటుంబసభ్యులు కొట్టుకున్నారు. విందు సమయంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి విందులో మటన్ పెట్టలేదని వరుడి వర్గం వాగ్వాదానికి దిగింది. అయితే ఆ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. సహస్ర జిల్లాలోని సిమ్రి భక్త్యార్పూర్ గ్రామంలో ఈ కొట్లాట జరిగింది. అమ్మాయి, అబ్బాయి తరపున బంధులు తన్నుకున్న ఘటనలో మొత్తం 12 మంది గాయపడ్డారు. విందులో మటన్ పెడుతామని చెప్పిన అమ్మాయి తరపున కుటుంబీకులు హామీ ఇచ్చారు, కానీ భోజనంలో చికెన్ పెట్టడాన్ని వ్యతిరేకించారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి జరిగింది. వాస్తవానికి పెళ్లి కార్యక్రమాలు శాంతియుతంగానే ముగిశాయి. కానీ భోజనం వేళ మాత్రం రెండు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. వెడ్డింగ్ మెనూలో మటన్ పెడుతామని హామీ ఇచ్చి.. ప్లేట్లల్లో చికెన్ పెట్టడాన్ని వరుడి తరపున బంధువులు వ్యతిరేకించారు. ఆ సమయంలో అతిథులు, నిర్వాహకుల మధ్య గొడవ జరిగింది. మాటల యుద్ధం కాస్త భౌతిక దాడిగా మారింది. ఓ వ్యక్తి ఏకంగా కత్తితో హంగామా చేశాడు. ఫైటింగ్‌కు చెందిన వీడియో వైరల్ అయ్యింది. గాయపడ్డవారిని భక్త్యార్పూర్ ఆస్పత్రిలో చేర్పిచారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు జరుగుతోంది.
Lni One🔷 10-7-26,006
🚨 बिहार: निकाह के भोज में मटन की जगह चिकन परोसने के विवाद में मारपीट,सहरसा के सिमरी बख्तियारपुर में निकाह के बाद आयोजित भोज के दौरान मेन्यू को लेकर विवाद हो गया। दूल्हा पक्ष का आरोप है कि मटन की जगह चिकन परोसे जाने पर कहासुनी शुरू हुई, जो देखते ही देखते… pic.twitter.com/Vv0QcdU04c
— LNI One (@lninewsagency) July 10, 2026