హిందువుల కోసం దుర్గా పూజ మంటపం ఏర్పాటు చేసిన ముస్లింలు!

కోల్‌కతా : మతసామరస్యానికి ప్రతీకగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలోని అలీముద్దీన్ వీధిలో స్ధానిక ముస్లింలు అక్కడ నివసించే హిందువుల కోసం దుర్గా పూజ మంటపాన్ని ఏర్పాటు చేశారు. కోల్‌కతాలోని అలిముద్దీన్ వీధిలో ముస్లింలు అధికంగా ఉంటారు. ఈ ప్రాంతం నుంచి పలు హిందూ కుటుంబాలు వలస వెళ్లడంతో 15 ఏండ్ల నుంచి ఇక్కడ దుర్గా పూజ వేడుకలు జరగడం లేదు. ఇక్కడ కేవలం మూడు హిందూ కుటుంబాలే మిగిలి ఉండటంతో దసరా వేడుకలు కళ తప్పాయి. ఈ ఏడాది ఎలాగైనా దుర్గా పూజ నిర్వహించాలని ఈ మూడు కుటుంబాల వారు స్ధానిక ముస్లింలను సంప్రదించారు.
సమాజంలో మతసామరస్యం, సోదరభావం పెంచేందుకు సంకేతంలా దుర్గా పూజ మంటపాన్ని హిందూ సోదరుల కోసం ఏర్పాటు చేసేందుకు ముస్లింలు సంతోషంగా ముందుకొచ్చారు. ముందు తామంతా బెంగాలీలమని, తాము ఇక్కడే పుట్టామని, మతం తాలూకు గుర్తింపులు తర్వాతేనని స్ధానిక ముస్లింఉ తౌసిఫ్, రఫీక్‌లు చెప్పుకొచ్చారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు వంటి మతాలేవైనా తాము పండుగలన్నింటినీ కలిసి జరుపుకుంటామని అన్నారు. ఈద్ సందర్బంగా హిందూ, క్రైస్తవులు తమ ఇండ్లకు వస్తారని, వారి ఇండ్లలో జరిగే పూజల్లో తాము పాల్గొంటామని చెప్పారు. మరోవైపు దుర్గా పూజ సందర్భంగా మంటపాల వద్ద కోల్‌కతా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

