గ్వాలియర్ : ముస్లిం పర్సనల్ లాలో చట్టపరమైన నిబంధన లేనంత మాత్రాన ముస్లిం పురుషుడికి న్యాయం లభించే అవకాశం లేదని కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ స్పష్టం చేసింది. ముస్లిం మ్యారేజెస్ యాక్ట్, 1939 రద్దు కావడంతో పురుషుడు నేరుగా విడాకులు కోరే అవకాశం లేనందున విడాకులు పొందేందుకు ఆ వ్యక్తి ఫ్యామిలీ కోర్టు యాక్ట్, 1984లోని సెక్షన్ 7 కింద ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించవచ్చని హైకోర్టు తెలిపింది. విడాకుల డిక్రీని కోరే హక్కు లేదంటూ ఓ ముస్లిం పురుషుడి పిటిషన్ను తోసిపుచ్చుతూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టిన హైకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.