కోల్‌కతా: వారిద్దరూ హత్య కేసుల్లో ఖైదీలు.. ఇద్దరిదీ ఒక రాష్ట్రం కాదు. ఒక భాషా కాదు.. అంతకుముందు ఒకరికొకరు తెలియదు. అయినా వారిద్దరినీ కలిపింది బెంగాల్‌లోని ఒక జైలు.
వేర్వేరు హత్య కేసుల్లో అస్సాంకు చెందిన అబ్దుల్ హసీమ్‌కు 8 ఏండ్లు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన శంకర ఖాటున్కు ఆరు ఏండ్లు శిక్షపడటంతో బెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్ జిల్లాలోని బర్ధమాన్ సెంట్రల్ కరెక్షన్ హోమ్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో ఒకరికొకరికి పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీందో వీరిద్దరూ పెరోల్‌పై విడుదలై వివాహం చేసుకున్నారు.