Murder : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో దారుణం జరిగింది. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోని సర్దార్ అని పిలువబడే జస్వంత్ సింగ్ (45) ఇటీవల పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. 2016లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. దాబ్రాలోని గోపాల్ బాగ్ సిటీలో నివసించే జస్వంత్ అక్టోబర్ 28న 15 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత రోడ్డుపైకి వచ్చి స్థానికులతో సంభాషిస్తున్నాడు.
ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. దాంతో జశ్వంత్ సింగ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది చూసిన జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సింగ్‌ను గ్వాలియర్‌లోని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.
జశ్వంత్ సింగ్ సత్ప్రవర్తన కారణంగా అప్పుడప్పుడు పెరోల్‌పై విడుదలవుతుంటాడు. ఈసారి 15 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో భోజనం తర్వాత ఇరుగు పొరుగుతో మాట్లాడుతుండగా దుండగులు కాల్చి చంపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | MP: Released Prisoner Fatally Shot By Two Attackers On Motorcycle In Gwalior#MadhyaPradesh #gwalior #MPNews pic.twitter.com/m8avkf3kN1
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 8, 2024