ముంబై: ముంబైలోని ఒక మహిళ సహ యజమాని అయిన తన సవతి సోదరునికి తెలియకుండా ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఫ్లాట్‌ను అమ్మేసింది. బాధితుని ఫిర్యాదు మేరకు ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబైలోని అతి ఖరీదైన లోయర్ పారెల్ ప్రాంతంలో ఉన్న ఫ్లాట్‌ను అబిదా ఇస్మాయిల్ తన సవతి సోదరుడు అయాజ్ కపాడియాకు తెలియకుండా రూ.100 కోట్లకు అమ్మేసింది. వాస్తవానికి ఆ ఫ్లాట్ కపాడియా దివంగత తండ్రి జాఫర్ కపాడియా, అతని సోదరుడు లతీఫ్ కపాడియా పేరుపై ఉంది. అయితే ఇటీవల లతీఫ్ కుమార్తె, కుటుంబ సభ్యులు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేశారు.