Bomb Threat | దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పలు విమానాలకు ఇవాళ వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టిస్తున్నాయి. అయితే విమానాలకే కాదు, రైలుకు కూడా ఇలాంటి బెదిరింపులే రావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం ముంబై – హౌరా మెయిల్ (Mumbai – Howrah Mail)కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆఫ్ – కంట్రోల్‌కు మెయిల్ ద్వారా ఓ సందేశం వచ్చింది. అందులో 12809 నంబర్ గల రైలును టైమర్ బాంబు (timer bomb)తో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్రైన్‌ను జల్గావ్ స్టేషన్ (Jalgaon station) వద్ద ఆపి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేశారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ కనిపించలేదని సమాచారం. తనిఖీల అనంతరం రైలు తిరిగి గమ్య స్థానానికి వెళ్లినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Mumbai-Howrah Mail received a threat to blow up the train with a timer bomb. Around 4:00 AM, off-control received this message. Train number 12809 was stopped at Jalgaon station and checked. No suspicious object was found in it. After this, the train proceeded towards the…
— ANI (@ANI) October 14, 2024
కాగా, గత వారం పూరీ – న్యూ ఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపుల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా రైల్వే స్టేషన్లో రైలు మూడు గంటలకు పైగా ఆలస్యం అయ్యింది. రైల్లో పేలుడు పదార్థాలతో అనుమానిత ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, పూర్తి విచారణ అనంతరం అది బూటకమని తేలింది.
ఇక ఇవాళ ఉదయం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India), ముంబై నుంచి మస్కట్, జెడ్డా వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా ఘటనలపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Bomb Threat | ముంబై నుంచి జెడ్డా, మస్కట్‌కు వెళ్తున్న రెండు విమానాలకు బాంబు బెదిరింపులు
Donald Trump | ట్రంప్‌పై మరోసారి హత్యా ప్రయత్నం.. ర్యాలీలో తుపాకీలతో వ్యక్తి హల్చల్
Air India | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్