Donald Trump | ట్రంప్‌పై మరోసారి హత్యా ప్రయత్నం.. ర్యాలీలో తుపాకీలతో వ్యక్తి హల్చల్
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై మరోసారి హత్యా ప్రయత్నం జరిగింది.
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై మరోసారి హత్యా ప్రయత్నం జరిగింది. ట్రంప్ ఎన్నికల ప్రచార సభ సమీపంలో తుపాకీ కలకలం రేపింది. కాలిఫోర్నియా (California)లోని కోచెల్లా (Coachella Valley)లో నిర్వహించిన ట్రంప్ ఎన్నికల ర్యాలీలో ఓ వ్యక్తి రెండు గన్లతో సంచరించినట్లు సీక్రెట్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.
మరో నాలుగు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాన అభ్యర్థులు ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార జోరు పెంచారు. అయితే, ఈ ఎన్నికల వేళ అభ్యర్థులపై దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మూడోసారి అలాంటి ప్రయత్నమే (Third assassination attempt) జరగడం ఇప్పుడు ట్రంప్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
నిందితుడిని వేం మిల్లర్‌గా (49) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ప్రెస్కార్డ్, ఎంట్రీ పాస్‌తో ర్యాలీలోకి ప్రవేశించిన మిల్లర్.. వేదికకు సమీపంలో లోడ్ చేసిన షాట్‌గన్, హ్యాండ్‌గన్, అధిక సామర్థ్యం గల మ్యాగజైన్‌తో తిరుగుతున్నట్లు సీక్రెట్ సర్వీసెస్ గుర్తించింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనలో ట్రంప్‌కు గానీ, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పూ వాటిల్లలేదని పోలీసులు వెల్లడించారు.
ట్రంప్‌పై వరుస కాల్పుల ఘటనలు..
కాగా, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం డయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఆ తర్వాత ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం (security threat) బయటపడింది.
గత నెల 30న పెన్సిల్వేనియా (Pennsylvania)లోని జాన్స్టౌన్ (Johnstown)లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
గత నెల 15న కూడా ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు.
Also Read..
Boeing | సమ్మె ఎఫెక్ట్.. 17 వేల మంది ఉద్యోగులపై బోయింగ్ వేటు!
Donald Trump | అధ్యక్షుడినైతే వాళ్లందరికీ ఉరే.. అమెరికన్లను చంపిన వలసదారులపై ట్రంప్ ఆగ్రహం
Gaza | గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత.. 29 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

