Tahawwur Rana | ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ రాణా (Tahawwur Rana) ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. నిఘా అధికారులు, దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తహవూర్ రాణాను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఈ విమానం ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు తహవూర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సాయుధ కమాండోలు మోహరించారు. తహవూర్ రాణాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. అక్కడ అధిక భద్రత మధ్య ఆయన్ని విచారించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాణాను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (special public prosecutor)గా నరేందర్ మాన్‌ను (Narender Mann) నియమిస్తూ కేంద్ర హోం శాఖ (MHA) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు దిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తరఫున ఆయన వాదనలు వినిపించనున్నారు.
Also Read..
Tahawwur Rana | ఎవరీ తహవూర్ రాణా..? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి..?