ముంబైలో కొత్తగా 32 మీజిల్స్ కేసులు.. 1.34 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్
Mumbai | ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. దీంతో మొత్తం కేసులు
ముంబై: ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. దీంతో మొత్తం కేసులు 300కి చేరువయ్యాయి. వీటిలో గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదయ్యాయి. గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 నెలల బాలుడు కన్నుమూశాడు. దీంతో మీజిల్స్‌తో నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మృతిచెందారు.
బీఎంసీ పరిధిలోని ముంబై, మాలేగావ్, భీవాండీ, థాణే, నాసిక్, అకోలా, కళ్యాణ్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు రికార్డవుతున్నాయి. దీంతో ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, బాంద్రా, అంధేరీ, మలాడ్, గోవండీ, చెంబూర్, కుర్లా, భాండూప్ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మొత్తం 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhiwandi
- BMC
- fresh cases
- Measles
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

