COVID-19 : కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మంగళవారం ఏకంగా 10,860 తాజా కేసులు వెలుగుచూశాయి. నిన్నటితో పోలిస్తే 34 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. 89 శాతం పాజిటివ్ కేసుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.
తాజా కేసుల్లో 834 మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్ధితి నెలకొనగా 52 మంది రోగులకు ఆక్సిజన్ అవసరమైందని హెల్త్ బులెటిన్ పేర్కొంది. ఇక మహమ్మారి బారినపడి ముంబైలో గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించగా యాక్టివ్ కేసుల సంఖ్య 47,476కి ఎగబాకింది. కొవిడ్-19 కేసుల పెరుగుదలతో ముంబైలో కఠిన నియంత్రణలు అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.