ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఫోన్ చేసి బెదిరించిన మహిళ (34)ను ముంబై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తన వద్ద ఓ తుపాకీ ఉందని, మోదీపై దాడికి సిద్ధంగా ఉన్నానని ఆమె బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఆ మహిళ మానసిక పరిస్థితి నిలకడగా లేనట్లు తెలుస్తున్నదని, అయినా ఆమె చేసిన బెదిరింపులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రముఖ నేతలను హత్య చేస్తామని ఇటీవల బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం పెరుగుతున్నది.