ముంబై పేలుళ్ల కుట్రదారుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ముంబై పేలుళ్ల కుట్రదారుడు, లష్కరే తాయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రరం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మరణించాడు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడంతో కొన్ని రోజుల క్రితం లాహోర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరిన మక్కీ.. గుండెపోటు రావడంతో చనిపోయినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కుట్రదారుడు, లష్కరే తాయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రరం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మరణించాడు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడంతో కొన్ని రోజుల క్రితం లాహోర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరిన మక్కీ.. గుండెపోటు రావడంతో చనిపోయినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 మేలో మక్కీనీ అరెస్టు చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉంచింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడని నమోదైన కేసులపై విచారణ జరిపిన పాక్ కోర్టు 2020లో అతడిని దోషిగా తేల్చింది. 2023 జనవరిలో మక్కీకి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులలో మక్కీకి ప్రమేయం ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్టు మక్కీపై ఆరోపణలు ఉన్నాయి. రెడ్ ఫోర్ట్‌పై 2000 డిసెంబర్ 22న జరిగిన దాడిలో కూడా మక్కీకి సంబంధం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

