ముంబై: సోషల్ మీడియా కోసం రీల్స్ చేయడం ఇప్పుడో ఫ్యాషన్. ఆ రీల్స్ చేయడంలో ముంబై యువతి అన్వి కామ్దార్(Anvi Kamdar) ఫేమస్. అయితే తాజాగా ఓ వీడియో తీసే క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో వీడియో తీసే సమయంలో ఆమె ఓ లోయలో పడిపోయింది. 27 ఏళ్ల ఆ అమ్మాయి.. రీల్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. వర్షాకాలం ఎంజాయ్ చేసేందుకు ఏడు మంది ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్లిన ఆ అమ్మాయి.. కుంబే వాటర్‌ఫాల్ వద్ద ఉన్న 300 ఫీట్ల లోతైన లోయలో పడిపోయింది. వీడియో తీసే క్రమంలో ఆమె పడిపోయినట్లు పోలీసులు చెప్పారు.
ముంబైలోని ములుండ్ ఏరియాలో అన్వి కామ్దార్ నివాసం ఉంటోందని మన్‌గావ్ పోలీసులు తెలిపారు. జలపాతం వద్ద ఉన్న సీనరీని వీడియో తీస్తున్న సమయంలో ఆమె కాలుజారి లోయలో పడినట్లు పోలీసు అధికారి చెప్పారు. ఫ్రెండ్స్ అలర్ట్ చేయడంతో.. పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత మన్‌గావ్ తాలూకా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది.
వృత్తిరీత్యా కామ్దార్.. చార్టర్డ్ అకౌంటెంట్‌గా చేస్తున్నారు. రీల్స్ ద్వారా ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయ్యారు.