ఈ నెల 12 నుంచి మొగల్ గార్డెన్ సందర్శనకు అనుమతి : రాష్ట్రపతి భవన్
పర్యాటకుల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్లోని మొగల్ గార్డెన్ ఈ నెల 12 నుంచి మార్చి 16 వరకూ అందుబాటులో వుంటుందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అడ్వాన్స్ ఆన్లైన్ బుకింగ్ మాత్రం చేసుకున్న వారికి మాత్రమే మొగల్ గార్డెన్స్ సందర్శనం కోసం అనుమతిస్తామని రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. https://rashtrapatisachivalaya.gov.in లేదా https://rb.nic.in/rbvisit/visit_plan.aspx లింక్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తామని రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం సందర్శకులకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అయితే కరోనా దృష్ట్యా సందర్శకులందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. విధిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేని వారికి ప్రవేశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

