Muda Scam | బెంగళూరు, అక్టోబర్ 7: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా కుంభకోణానికి సంబంధించిన కీలక దస్ర్తాలు మాయమైనట్టు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన డీజీపీ అలోక్ మోహన్‌ను కలిసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరాతి సురేశ్, లోకాయుక్త మాజీ ఎస్పీ సుజీత్‌పై ఫిర్యాదు చేశారు. వీరిద్దరు కలిసి జూలైలో ముడా కుంభకోణానికి సంబంధించిన కీలక దస్ర్తాలను తరలించారని ఆయన ఆరోపించారు. ఈ స్కామ్ గురించి బయటకు వచ్చిన తరాత మంత్రి బైరాతి సురేశ్ హెలికాప్టర్లో మైసూరుకు వెళ్లి కీలక ఫైళ్లను తెచ్చారని, ఇందుకు సుజీత్ సాయపడ్డారని స్నేహమయి కృష్ణ పేర్కొన్నారు. కాగా, ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు, ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.