మైసూర్: కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్ఎంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సహా 18 మంది అధికారులకు మైసూర్ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. పలుకుబడి కలిగిన 350 మంది వ్యక్తులకు అక్రమంగా స్థలాలు కేటాయించారన్న ఆరోపణలపై నోటీసులు జారీ చేసిన లోకాయుక్త ఈనెల 12న తప్పకుండా తమ ముందు విచారణకు హాజరు కావాలని అధికారులను ఆదేశించింది.
అధికారుల అక్రమ భూముల కేటాయింపులపై 2017లో ఆర్టీఐ కార్యకర్త గంగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఈ నోటీసులు ఇచ్చింది. ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్య చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన సతీమణికి ఖరీదైన ప్రాంతంలో భూమి కేటాయించినట్టు ఆరోపణలున్నాయి.