MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
MS Dhoni : జెన్-జీ ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోని ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల దీర్ఘకాలికంగా వారి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందన్నారు.
MS Dhoni : జెన్-జీ ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోని ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల దీర్ఘకాలికంగా వారి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందన్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి ధోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెన్-జీకి కీలక సూచన చేశారు. జెన్-జీ, జెన్-ఆల్ఫా పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. వారి ఆహారపు అలవాట్లు ఆందోళనకరంగా ఉన్నాయని, మార్చుకోవాలని సూచించారు.
అలాగే, శారీరక శ్రమ, మంచి ఆహారంపై దృష్టి సారించాలన్నారు. అయితే, ఇప్పటి తరంలో కొందరు గతంకంటే మెరుగైన సామాజిక, నైతిక విలువలు పాటిస్తున్నారని, ఇది హర్షణీయం అన్నారు. అలాగే, పెద్దలు కూడా ఎప్పుడూ తామే సరైన వాళ్లం అనుకోకుండా, కొత్త తరం నుంచి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. భారతీయులు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకుంటారనే విషయంపై కూడా ధోని మాట్లాడారు. భారతీయుల జీవనశైలి, శారీరక శ్రమ కారణంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
MS Dhoni & Javed Akhtar’s advice for Gen-Z and Millennials https://t.co/enjEKxMGTx
— 𝗦💛 (@mostlydhoni78) October 24, 2026
ప్రస్తుతం మారిన రోజువారీ జీవనశైలి, ఎక్కువగా యాక్టివ్‌గా లేకపోవడం, ఒకేరకమైన ఆహారం తీసుకోవడం వంటివి ఇప్పుడు చాలా మందికి సరిపోకపోవచ్చు అన్నారు. ఆహారపు అలవాట్లు ప్రాంతాన్నిబట్టి వేరుగా ఉంటాయని, అందరికీ ఒకే రకమైన ఆహారం సరిపోదని ధోని అన్నారు. నేటి కాలంలో చాలా మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉబర్ కార్ లేదా ఆటో ఎక్కుతున్నారు. కూర్చుని వెళ్లి, కూర్చుని పని చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి కూడా పెరిగిపోయింది. చక్కెర ఉండే ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఇలా మార్కెట్లో దొరుకుతోంది. అయితే, శారీరక శ్రమ తక్కువగా ఉండేవారికి ఇలాంటి ఆహారం సరిపోదు అంటూ ధోని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- fast food
- Gen Z
- Health
- Javed Akhtar
RELATED ARTICLES
తాజా వార్తలు
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

