MPhil | ఎంఫిల్ కోర్సులకు గుర్తింపే లేదు, ఎవరూ చేరొద్దు.. యూజీసీ సెక్రటరీ హెచ్చరిక
MPhil | ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంఫిల్కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ సెక్రటరీ స్పష్టం చేశారు.
MPhil | న్యూఢిల్లీ : ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంఫిల్కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ సెక్రటరీ స్పష్టం చేశారు. దేశంలోని ఆయా యూనివర్సిటీలు అందించే ఎంఫిల్ ప్రోగ్రామ్లకు ఎలాంటి గుర్తింపు లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఎంఫిల్ ప్రవేశాలు ఎవరూ తీసుకోవద్దని సూచించారు.
ఎంఫిల్ కోర్సులను యూజీసీ రద్దు చేసిందని సెక్రటరీ గుర్తు చేశారు. అయినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2023-24 విద్యాసంవత్సరంలో ఎంఫిల్ కోర్సులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని యూజీసీ గుర్తు చేసింది. ప్రస్తుతం కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. ఆ విషయం యూజీసీ దృష్టికి రావడంతో మరోసారి హెచ్చరించాల్సి వచ్చిందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

