Engineer Rashid : అవామీ ఇత్తేహాద్ పార్టీ (Awami Ittehad Party) అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ (Sheikh Abdul Rashid) అలియాస్ ఇంజినీర్ రషీద్ (Engineer Rashid) ఇవాళ మధ్యాహ్నం తీహార్ జైల్లో (Tihar Jail) లొంగిపోయారు. నాలుగు నెలల క్రితం ఆయనకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ (Interim bail) గడువు ముగియడంతో ఆయన తీహార్ జైలు అధికారుల ముందు సరెండర్ అయ్యారు.
ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించినట్లు ఆరోపణలు రావడంతో 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (National Investigation Agency) ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఎదుర్కొంటూ ఆయన తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఏకంగా రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పార్టీ తరఫున 34 మంది అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల్లో తన అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం మూడు నెలలపాటు మధ్యంతర బెయిల్ కావాలని కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. దాంతో కోర్టు 2024 అక్టోబర్ 2 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తన తండ్రి అనారోగ్యం రీత్యా ముందుగా అక్టోబర్ 12 వరకు, ఆ తర్వాత అక్టోబర్ 28 వరకు బెయిల్ గడువు పొడిగించారు. ఇవాళ్టితో ఆ గడువు కూడా ముగియడంతో రషీద్ లొంగిపోయారు.
#WATCH | Delhi: President of Awami Ittehad Party & MP, Sheikh Abdul Rashid alias Engineer Rashid surrenders to Tihar Jail after the tenure of his interim bail ended.
His interim bail was extended till October 28 on the grounds of his father’s health. He was earlier granted… pic.twitter.com/8I9NUPTp3A
— ANI (@ANI) October 28, 2024