బోఫాల్: మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన మహిళా క్రికెట్లకు గుణపాఠం లాంటిదని అన్నారు. వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ‘బయటకు వెళ్లేటప్పుడు వాళ్లు స్థానిక అధికారులకు లేదా టీమ్ భద్రతాధికారులకు చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే భారత్‌లో క్రికెటర్లంటే ఎంతో క్రేజ్ ఉంది’ అని ఆయన అన్నారు. క్రికెటర్ల చర్య తప్పని అన్నారు. మెరుగైన కమ్యూనికేషన్, భద్రతా ప్రొటోకాల్‌ను నిర్ధారించడానికి ఈ ఘటన అధికారులు, ఆటగాళ్లకు ఒక గుణపాఠం లాంటిదని చెప్పారు.