Cancer | న్యూఢిల్లీ, జూలై 27: తల, మెడ భాగంలో వచ్చే క్యాన్సర్ కణతులను (శరీరం లోపల, బయట ఏర్పడుతుంటాయి) నోటిలో ఉండే మంచి బ్యాక్టీరియా తుదముట్టిస్తుందన్న సంగతి తాజా అధ్యయనంలో తేలింది. ‘ఫూసోబ్యాక్టీరియం’ అనేది 99 శాతం క్యాన్సర్ కణాల్ని అంతమొందిస్తుందని, క్యాన్సర్ చికిత్సలో కీలక భూమిక వహిస్తుందని సైంటిస్టులు తేల్చారు.
‘జర్నల్ క్యాన్సర్ కమ్యూనికేషన్స్’ కథనం. 155 మంది రోగుల డాటాను తీసుకొని వివిధ రకాలుగా ప్రయోగాలు జరిపారు. నోట్లో ఫూసోబ్యాక్టీరియా ఉన్న రోగుల్లో క్యాన్సర్ 65 శాతం తగ్గుదల కనిపించింది. ప్రయోగశాలలో క్యాన్సర్ కణాలపై బ్యాక్టీరియాను ప్రయోగించగా, కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ కణాల్లో 70 నుంచి 99 శాతం వరకు తగ్గుదల కనపడింది.