Kolkata Incident : తమ కూతురిని వైద్యురాలిని చేసేందుకు తామెంతో కష్టపడ్డామని, చివరకు ఆమెను కిరాతకంగా హత్య చేశారని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ ఆస్పత్రి ఘటనలో బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. దోషిని వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చినా ఇంతవరకూ ఏం జరగలేదని విచారం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని, అయితే ఈ ఘటనలో పలువురి ప్రమేయం ఉందని తాను భావిస్తున్నా్నని చెప్పారు.
ఈ ఘటనకు మొత్తం డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. తమ కూతురి హత్యాచార ఘటనపై పెల్లుబుకిన నిరసనను చల్లార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నానని అన్నారు. ప్రజలు నిరసన చేపట్టకుండా నిరోధించేందుకు ఈరోజు 144 సెక్షన్ విధించారని అన్నారు.
పోలీసులు తమతో ఏమాత్రం సహకరించడం లేదని, వారు వీలైనంత త్వరగా కేసును మూసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పోస్ట్మార్టం నిర్వహించి సత్వరమే మృతదేహాన్ని తొలగించాలనే ఆతృతతో ఉన్నారని మండిపడ్డారు. మరోవైపు తమ కూతురి మృతదేహాన్ని తమకు ఆలస్యంగా చూపించారని, ఆమె వంటిపై పలు గాయాలున్నాయని, ఇది ఆత్మహత్య కాదు హత్యేనని తాను ఆస్పత్రి సిబ్బంది, పోలీసులకు స్పష్టం చేశానని చెప్పారు.
Read More :
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్లకు రేపట్నుంచే రిజిస్ట్రేషన్