Mother Dairy | మదర్, అమూల్ పాల ధరల పెంపు.. నేటి నుంచి అమలు
పెట్రోలే కాదు ఇప్పుడు పాలు కొనడం కూడా సామాన్యునికి భారంగా మారింది. ప్రముఖ అమూల్, మదర్ డెయి రీలు వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిం చాయి.
- రూ.1 నుంచి రూ.5 వరకు పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలే కాదు ఇప్పుడు పాలు కొనడం కూడా సామాన్యునికి భారంగా మారింది. ప్రముఖ అమూల్, మదర్ డెయి రీలు వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిం చాయి. ఈ పెరిగిన కొత్త ధరలు మే 14 నుంచి అమలులోని వస్తాయిని తెలిపాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, ఆవు పాలు, గేదె పాలు, ప్రీమియం వేరియంట్లపై ఈ ధరలు పెంపుదల ఉండనుంది.
ఉత్పత్తి, ప్యాకెట్ పరిమాణాన్ని బట్టి పెరుగుదల రూపాయి నుంచి ఐదు రూపాయల వరకూ ఉండనుంది. గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎం ఎంఎఫ్) ద్వారా మార్కెట్ అయ్యే అమూల్.. పలు క్యాటగి రీలలో లీటరుపై రూపాయి నుంచి రెండు రూపాయల వరకూ పెంచు తున్నట్లు ప్రకటించింది.
సవరించిన ధరల ప్రకారం అమూల్ గోల్డ్(ఒక లీటరు) ధర రూ. 68 నుంచి రూ.70కి పెరిగింది. అమూల్ తాజా (ఒక లీటరు) ధర రూ. 55 నుంచి రూ. 57కు చేరుకుంది. ఇక మదర్ డెయిరీ విషయానికొస్తే గేదె పాలు ఒక లీటరు రూ. 75 నుంచి రూ.80కి పెరిగింది. మిగిలిన వేరియట్ల ధరలలో కూడా పెరుగుదల చోటుచేసుకుంది. నిర్వహణ, సేకరణ ఖర్చులు పెరగడం, రవాణా ఛార్జీలు అధికం కావడం, ప్యాకేజీ ఖర్చులు తడిసి మోపెడవడంతో పాల ధరలను పెంచుతున్నట్లు ఈ రెండు డెయిరీలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

