హరిద్వార్, జూన్ 5: ఉత్తరాఖండ్‌లో ఓ బీజేపీ నాయకురాలు తన మైనర్ కుమార్తెపై గ్యాంగ్‌రేప్ చేయించారు. తల్లి అనుమతితోనే ఆమె బాయ్‌ఫ్రెండ్, అతడి సహాయకుడు తనపై పలుమార్లు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పడం పోలీసులను షాక్‌కు గురిచేసింది. బాధిత మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత హరిద్వార్ పోలీసులు, మైనర్ బాలిక తల్లిని, ఆమె బాయ్‌ఫ్రెండ్, సహాయకుడ్ని అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్, బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
హరిద్వార్ జిల్లా మహిళా మోర్చా మాజీ నాయకురాలు అనామిక శర్మ అంగీకారంతో ఆమె బాయ్‌ఫ్రెండ్ పట్వాల్, అతడి సహాయకుడు శుభం మైనర్ బాలికను పలుమార్లు సామూహిక లైంగికదాడి చేసినట్టు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య హరిద్వార్, ఆగ్రా, బృందావన్‌లలో నిందితులు ఇద్దరు.. మైనర్ బాలికపై పలుమార్లు హత్యాచారం చేశారని, తల్లి అనుమతి, సమక్షంలోనే ఇది జరిగిందని పోలీసులు చెప్పారు.