న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: బీరు తాగేవాళ్లను, సరిగా స్నానం చేయని వాళ్లను దోమలు ఎక్కువగా కుడుతున్నాయని నెదర్లాండ్స్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మద్యం సేవించని వాళ్లతో పోల్చితే బీరు తాగేవాళ్లను దోమలు 35 శాతం అధికంగా కుడుతున్నాయన్న కొత్త సంగతిని పరిశోధకులు కనుగొన్నారు. అంతేగాక, సరిగా స్నానం చేయని వ్యక్తులను, సన్‌స్క్రీన్ లోషన్ వాడని వాళ్లను, ఇతరులు నిద్రపోయిన చోట పడుకున్న వాళ్లను దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు పరిశోధనలో తేలింది.
ఒక మ్యూజికల్ ఫెస్టివల్లో పాల్గొన్న 500 మందిని పరిశోధకులు తమ వినూత్న ప్రయోగానికి ఎంచుకున్నారు. పెద్ద సంఖ్యలో దోమలతో ఉన్న బాక్స్‌లో అభ్యర్థులు చేతులు పెట్టగా, ఎవరి చేతులపై దోమలు వాలుతున్నాయన్నది కెమెరాలతో పరిశీలించారు. ఎలాంటి అలవాట్లు ఉంటే దోమకాటుకు ఎక్కువగా గురవుతామన్నది తెలుసుకునేందుకు పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టినట్టు తెలిసింది.