న్యూఢిల్లీ: మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య భారీగా పెరిగింది. శిథిలాలు వెలికితీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2059కి పెరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. మరకేశ్ పట్టణానికి 72 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.