శీతాకాలంలో కాలుష్య నియంత్రణకు చర్యలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఢిల్లీలో వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు 10 అంశాలతో ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ పొరుగు రాష్ర్టాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా ‘పుసా బయో డీ-కంపోజర్’ను ఉపయోగించాలని, దాని ద్వారా దుమ్మూధూళిని నివారించవచ్చని తెలిపారు. దానిని కేం ద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పిచికారీ చేసేలా చూడాలని కోరారు. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్లో మాదిరిగా ఇతర ప్రాంతాల్లోనూ స్మాగ్ టవర్స్ ఏర్పాటు, వ్యర్థాలను తగులబెట్టకుండా చూసేందుకు, వాహన కాలుష్యం నియంత్రణకు ప్రత్యేక బృందాలతో తనిఖీలు తదితర అం శాలు ఆ ప్రణాళికలో ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతంలోని థర్మర్ విద్యుత్తు కేంద్రాల్లో ఆధునిక టెక్నాలజీని వినియోగించాలని పొరుగు రాష్ర్టాలను కేజ్రీవాల్ కోరారు. ఎన్సీఆర్ ప్రాంతంలో సీఎన్టీ వాహనాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.