న్యూఢిల్లీ, మార్చి 13: ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకు అక్షర రూపంలో జవాబులు ఇవ్వడం, కావాల్సిన ఈమెయిళ్లు, ఉత్తరాలు రాసిపెట్టడం వంటివి చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీలో త్వరలోనే మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
వచ్చే వారం అందుబాటులోకి రానున్న జీపీటీ-4 వర్షన్లో టెక్ట్స్‌ను వీడియోగా మార్చే ఫీచర్‌ను అందుబాటులో తెస్తున్నది. టెక్ట్స్ ఆధారంగా ఫొటోలు, వీడియోలను వినియోగించుకొని పూర్తిస్థాయి వీడియోగా చాట్‌జీపీటీ మార్చనుంది.