WMF | న్యూఢిల్లీ: ప్రమాదంలో ఉన్న వారసత్వ స్థలాల జాబితాలో చందమామను వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ (డబ్ల్యూఎంఎఫ్) చేర్చింది. భవిష్యత్తులో వాణిజ్యపరమైన అంతరిక్ష కార్యక్రమాలు చందమామను దోపి డీ చేసి, నష్టపరిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సాధారణంగా ఈ ఫండ్ భూమిపైగల సాంస్కృతిక ప్రాధాన్య ం గల స్థలాలపైనే దృష్టి పెడుతుంది.
కానీ చందమామకు పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో తొలిసారి ఈ జాబితాలో చేర్చింది. డబ్ల్యూఎంఎఫ్ సీఈఓ బెనెడిక్ట్ డీ మాంట్లార్ మాట్లాడుతూ, చందమామపై కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని, సరైన రక్షణ చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. మన చరిత్రలో ఇది నిర్వచనీయ సమయమని,భూమికి వెలుపల మానవుల తొలి కార్యక్రమాలను తెలియజేసే నిర్మాణాలను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు.