20 ఏండ్ల తర్వాత తొలిసారి మంచే మంచు!

రెండు దశాబ్దాల తరువాత జనవరి మొదటి వారంలో దేశవ్యాప్తంగా రుతుపవనాల వాతావరణం కనపడుతున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా హిమపాతం కురుస్తుండగా.. దక్షిణాది రాష్ట్రాలు వర్షంతో తడిసి ముద్దవుతున్నాయి. పాశ్చాత్య అవాంతరాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక తుఫాను గాలులు ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. హిమాలయ ప్రాంతంలో ఇప్పుడు వాతావరణం క్లియర్ అవుతున్నప్పటికీ దేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతాలన్నీ 5 నుంచి 8 అడుగుల మందపాటి మంచుతో కప్పబడి ఉన్నాయి.
మంచు, గాలుల ప్రభావం పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌లో కనిపిస్తున్నది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ హిమపాతం సంభవించింది. ఉత్తర మైదాన రాష్ట్రాల్లో అనాలోచిత భారీ వర్షాలు నమోదయ్యాయి. ఢిల్లీలో జనవరి 2 నుంచి 7 వ తేదీ మధ్య 57 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీకి సాధారణంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వర్షాలు ఎక్కువగానే కురుస్తాయి. చండీగఢ్, లడఖ్ మినహా వాయవ్యంలోని అన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది. గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ మధ్య ప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది.
జమ్ముకశ్మీర్‌లోని విమానాశ్రయం రన్‌వే పూర్తిగా మంచుతో నిండిపోయి ఉన్నది. విమానాల రాకపోకలకు తీవ్రం అంతరాయం కలుగుతున్నది. విమానాలను నిలిపే ప్రదేశంలో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధునాతన యంత్రాల స్థానంలో కొత్త రకం చీపుర్లను వాడటం ప్రారంభించినట్లు విమానాశ్రయం డైరెక్టర్ మల్కిత్సింగ్ చెప్పారు. మాన్యువల్‌గా తొలగింపు విమానాల కార్యాకలాపాలకు ఆటంకం కలిగించదని ఆయన తెలిపారు. ప్రస్తుతం, ఇక్కడి నుంచి ప్రతిరోజూ 8 విమానాలు ఎగురుతున్నాయి. రాజస్తాన్‌లో పాశ్చాత్య అవాంతరాల కారణంగా చలి పెరిగింది. ఇక్కడ రాత్రిపూట చలి మరీ ఎక్కువగా ఉంటుంది. కోటా-అజ్మీర్‌లో రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో 2 డిగ్రీల తేడా ఉన్నది. కోటలో కనిష్టంగా 15.6, గరిష్టంగా 17.6 డిగ్రీలు నమోదుకాగా, అజ్మీర్‌లో రాత్రికి 13.3 డిగ్రీలు, పగటిపూట 15.0 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి సమయంలో రాష్ట్రంలోని 10 కి పైగా ప్రదేశాల్లో 10 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మౌంట్ అబూలో ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీలుగా నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌తోపాటు 27 జిల్లాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాజధానిలో వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు 6.7 డిగ్రీలు పడిపోయి 20.9 డిగ్రీలకు చేరింది. అదే సమయంలో భోపాల్‌లో రాత్రి ఉష్ణోగ్రతలో 9 ఏండ్ల రికార్డు బద్దలైంది. రాత్రి ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలు కాగా.. అంతకుముందు 2012 జనవరి 1 న రాత్రి ఉష్ణోగ్రత 18.0 డిగ్రీలుగా నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో రికార్డు శీతాకాలం జనవరి 13 వరకు కొనసాగుతుంది. జనవరి 11 నుంచి 13 వరకు యెల్లో అలర్ట్ జారీ చేస్తారు. గంటకు 10-15 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు ఉన్నాయని, దీంతో రానున్న మూడు రోజుల్లో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ నిజమే!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త