ఇప్పుడంటే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి కాబట్టి.. ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఫోటో దిగాలంటే చాలా కష్టం. వీడియో చేయాలంటే చాలా కష్టం. అప్పుడు స్మార్ట్ఫోన్లు గట్రా లేవు. పెద్ద పెద్ద కెమెరాలు ఉండేవి. అందులోనే వీడియో కెమెరాతో రికార్డు చేసేవారు. పెళ్లిళ్లలో వీడియో కెమెరాలనే వాడేవారు.
ఇప్పుడు స్మార్ట్ఫోన్లు చేతుల్లో ఉండటం వల్ల ఏది పడితే అది వీడియో తీయడమే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. తాజాగా కోతులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఫోన్లో ఉన్న కోతుల వీడియోను కొన్ని కోతులకు చూపించాడు.
ఫోన్లో కోతులు ఉండటం చూసి ఆ కోతులు షాక్ అయ్యాయి. అసలు.. ఆ కోతులు ఈ బాక్స్‌లోకి ఎలా వెళ్లాయబ్బా అన్నట్టుగా అవి ఆ ఫోన్‌ను చూశాయి. తమ చేతులతో ఫోన్‌ను పట్టుకోవడం.. వాటిని ఆ ఫోన్ నుంచి బయటికి రావాలన్నట్టుగా సైగలు చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. మొత్తం మీద కోతుల ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు.. భలే భలే కోతులు అంటూ కామెంట్లు చేస్తున్నారు.