లక్నో: పోలీస్ బైక్‌కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్‌ను ఒక కోతి చోరీ చేసింది. (Monkey steals liquor bottle from bike) మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద పలువురు పోలీసులకు చెందిన బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఇంతలో ఒక కోతి ఒక బైక్ వద్దకు వచ్చింది. ఆ బైక్ సైడ్ బ్యాగులో ఉన్న లిక్కర్ బాటిల్‌ను బయటకు తీసింది. బాటిల్ మూత తీసి తాగేందుకు తెగ ప్రయత్నించింది. వీలు కాకపోవడంతో దానిని కింద పడేసింది. ఆ బ్యాగ్‌లో ఉన్న మరో మద్యం బాటిల్‌ను కూడా బయటకు తీసింది.
కాగా, గమనించిన పోలీసులు గట్టిగా కేకలు వేయడంతోపాటు ఆ బైక్ వద్దకు వెళ్లారు. దీంతో మరో లిక్కర్ బాటిల్‌ను కూడా కింద పడేసిన ఆ కోతి అక్కడి నుంచి పారిపోయింది. అక్కడ ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు లిక్కర్ అమ్మకాలు, మద్యపానంపై నిషేధం ఉన్న గాంధీ జయంతి రోజున జరిగిన ఈ సంఘటనపై కాన్పూర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారీ స్పందించారు. లిక్కర్ బాటిల్స్ ఉన్న ఆ పోలీస్ బైక్ ఎవరిదో అన్నది దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే కార్యాలయం ఆవరణలో కోతుల బెడదను నివారించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
कानपुर
➡पुलिस आयुक्त कार्यालय परिसर में घुसा बंदर
➡शराब की बोतल खोलता नजर आया बंदर
➡परिसर में खड़ी बाइक के बैग से निकाली शराब
➡CP ऑफिस में मौजूद पुलिसवालों ने बंदर को भगाया#Kanpur pic.twitter.com/KVMxiohwEz
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) October 2, 2023