న్యూఢిల్లీ: ఒక వ్యక్తి బ్యాగ్ జిప్ను ఒక కోతి తెరిచింది. అందులో ఉన్న ఆపిల్ పండును అది చోరీ చేసింది. ఒక యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాధారణంగా కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడతాయి. అలాగే మనుషుల చేతుల్లోని తినుబండారాలను లాక్కుపోతాయి. అయితే ఒక కోతి ఆహారం కోసం ఏకంగా ఒక వ్యక్తి బ్యాగ్ జిప్ను తెరిచింది. ఒక జిప్ భాగంలో దానికి ఏమీ కనిపించలేదు. దీంతో రెండో జిప్ను తెరిచింది. అందులో ఉన్న ఆపిల్ పండును చేతపట్టుకుని అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, ‘వావ్ ఆఫ్రికా’ అనే యూజర్ రెండు రోజుల కిందట ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే లక్ష మందికిపైగా దీనిని చూశారు. ఆరు వేల మందికిపైగా లైక్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై స్పందించారు. ఫన్నీగా కామెంట్లు చేశారు. అమెరికా అయినా ఆఫ్రికా అయినా కోతులన్నీ దొంగలేనని ఒకరు వ్యాఖ్యానించారు. మనుషుల చేతుల్లోని వస్తువులు, ఇళ్లలోని ఆహారాన్ని చోరీ చేస్తుంటాయని పేర్కొన్నారు.
;